అణు రియాక్టర్ల నిర్మాణం ఎల్ అండ్ టి ఒప్పందం

దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ ఎల్ అండ్ టీ సంస్థ రష్యా అణు ఇంధన దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. అణు రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధికి సంబంధించి ఎల్ అండ్ టీ, రష్యా కంపెనీ ఆటమ్‌స్టోరీఎక్స్‌పోర్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా తమిళనాడు, కూడంకుళంలో నాలుగు అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అణు రియాక్టర్లు సరఫరా చేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన 20 శాతం ప్రాజెక్టులు ఆటమ్‌స్టోరీఎక్స్‌పోర్ట్ ఖాతాలో ఉన్నాయని ఎల్ అండ్ టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్, రష్యా ప్రభుత్వాలు డిసెంబరు 5, 2008న ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఒప్పందం అనంతరం దేశంలో ఏర్పడిన అణు పరికరాల అవసరం, ఇతర సేవల కోసం తాజాగా రెండు కంపెనీలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. రష్యా భాగస్వామితో కలిసి ఎల్ అండ్ టీ నాలుగు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. అంతేకాకుండా ఆటమ్‌స్టోరీఎక్స్‌పోర్ట్‌కు సంబంధించిన భారత్, విదేశీ ప్రాజెక్టుల్లోనూ సహకారం కోసం ఎల్ అండ్ టీ ప్రయత్నిస్తోంది.

వెబ్దునియా పై చదవండి