టాటా నానో కారు.. హెలికాప్టర్ అయ్యింది.. ఎలాగంటే? (video)

బుధవారం, 21 డిశెంబరు 2022 (17:31 IST)
Nano helicopter
టాటా నానో కారు గురించి అందరికీ తెలిసిందే. బడ్జెట్ కారును టాటా సంస్థ గతంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు చాలా చిన్నదిగా వుండటంతో ఆ కారులో ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. తాజాగా ఈ నానో కారును హెలికాఫ్టర్ గా మార్చేశాడు.. యూపీ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. అజంగఢ్‌లో రూ. 3 లక్షలతో టాటా నానోను హెలికాప్టర్‌గా మార్చాడు యూపీ వ్యక్తి. 
 
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో ఒక వడ్రంగి నివాసం ఉంది. అతను రోడ్లపై కూడా ప్రయాణించగల హెలికాప్టర్‌ను నిర్మించాలనే తన లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. సల్మాన్ టాటా నానో కారును హెలికాప్టర్‌గా మార్చడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నాలుగు నెలల శ్రమతో వెచ్చించారు. ప్రస్తుతం ఈ నానో హెలికాఫ్టర్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. రోడ్లపై ప్రయాణించే హెలికాప్టర్‌ను రూపొందించామని తెలిపారు. దాదాపు రూ.3 లక్షలు వెచ్చించి నాలుగు నెలలు కాలంలో దీన్ని తయారు చేశామని చెప్పుకొచ్చాడు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు