భారతదేశంలో అత్యధికంగా షాపింగ్ జరిగిన ప్రైమ్ డే ఈవెంట్, ఎన్నడూ లేనంతగా జరిగింది. ఈ సంవత్సరం ప్రైమ్ డే ఈవెంట్ మునుపటి ప్రైమ్ డే ఈవెంట్ల కన్నా చాలా ఘనంగా జరిగింది. ఈ మూడు రోజుల్లో మరిన్ని ఎక్కువ ఐటెమ్స్ అమ్ముడుపోవటంతో రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేసుకున్నాయి. ప్రైమ్ మెంబర్లు, ఒక్క నిముషంలో 18,000లకు పైగా ఆర్డర్లను చేశారు (ప్రైమ్ డే 2024తో పోలిస్తే 50 శాతం కన్నా ఎక్కువ)
ఫాస్ట్ డెలివరీలు: 1వ శ్రేణి నగరాల్లో 4 గంటలలోపు లక్షల ఉత్పత్తులను డెలివర్ చేయటం జరిగింది. మెట్రో నగరాల్లో (ఏటికేడు 2 రెట్ల పెరుగుదల), 2వ శ్రేణి మరియు మూడవ శ్రేణి నగరాల్లో (ఏటికేడు 1.8 రెట్ల అభివృద్ధి), కస్టమర్లు తమ ఉత్పత్తులను అదే రోజున/తరువాతి రోజున అందుకున్నారు.
సెల్లర్బ్రేషన్ అయ్యింది: ప్రైమ్ డే 2025 సందర్భంగా, అతి ఎక్కువ మంది విక్రేతలకు, అన్ని ఎడిషన్లలోనూ విక్రయాలు లభించాయి. ప్రైమ్ డేల అన్ని మునుపటి ఎడిషన్లతో పోలిస్తే, చిన్న- మధ్యతరహా వ్యాపారవర్గాలు (ఎస్ఎంబిలు) అత్యధికంగా పాల్గొనటం అమెజాన్ దృష్టికి వచ్చింది.
కస్టమర్లు అమెజాన్ పేతో షాప్ చేశారు: ఈ ప్రైమ్ డే సందర్భంగా మరింత ఎక్కువ మంది ప్రైమ్ సభ్యులు అమెజాన్ పేతో షాపింగ్ చేశారు. వారిలో 60 శాతం మంది 2వ, 3వ శ్రేణి నగరాలు, పట్టణాలకు చెందినవారు. ప్రైమ్ డే 25 సందర్భంగా 50 శాతానికి పైగా కస్టమర్లు అమెజాన్ పే లేటర్‌ను ఉపయోగించారు.
బ్లాక్‌బస్టర్ ఎంటర్టెయిన్మెంట్, ఇంకా మరెంతో: ప్రైమ్ డే నాటికి ప్రైమ్ వీడియో 17 ప్రజాదరణ పొందే అవకాశాలు కలిగిన భారతీయ, అంతర్జాతీయ టైటిల్సును పలు భాషల్లో విడుదల చేసింది. వాటిలో ఒరిజినల్ సిరీస్, పంచాయత్ సీజన్ 4, ద ట్రెయిటర్స్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ఉప్పు కప్పురంబు, ఇంకా మరెన్నో మూవీస్ ఉన్నాయి. మెట్రోలు మొదలుకుని చిన్న పట్టణాల వరకు, 4,400లకు పైగా భారతీయ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రైమ్ సభ్యులు, ప్రైమ్ వీడియో యొక్క కంటెంట్ లైనప్‌ను స్ట్రీమ్ చేశారు. ప్రైమ్ డే 25 సందర్భంగా విడుదల చేసిన భారతీయ టైటిల్స్, భారతీయ ప్రేక్షకులకు నచ్చటం మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా 224 దేశాలు, ప్రదేశాల్లో స్ట్రీమ్ అయ్యాయి. అలాగే, భారతదేశంలో, అంతర్జాతీయ కంటెంటును ప్రైమ్ వీడియో మరింత ఎక్కువ మంది వద్దకు చేర్చింది.