అథేర్ ఎనర్జీ మరో 16 నగరాల్లో తన విస్తరణ ప్రణాళిక వేగవంతం

మంగళవారం, 8 డిశెంబరు 2020 (19:32 IST)
భారతదేశం యొక్క మొట్టమొదటి స్మార్ట్ స్కూటర్ తయారీదారు, అథేర్ అనర్జీ, తన 2వ దశ విస్తరణలో భాగంగా 16 నగరాలు.. అంటే మైసూర్, హుబ్లీ, జైపూర్, ఇందూర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీఘర్, విజయవాడ, విశాఖపట్నం, గువాహతీ, నాగ్పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురీలో కొత్తగా అథేర్  450Xను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అథేర్ ఎనర్జీ ఉత్పత్తులకు ఉన్న అధిక డిమాండ్, డీలర్షిప్ అభ్యర్థనలు, టెస్ట్ రైడ్స్ కోసం వస్తున్న లెక్కలేనన్ని అభ్యర్థనల కారణంగా అథేర్ ఎనర్జీ 2వ దశలో ఈ కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి పూనుకుంది. జాతీయ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అథేర్ ఎనర్జీ తన విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేసింది. 2021 త్రైమాసికంలో దేశంలోని 26 నగరాల్లో అథేర్ 450Xను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త నగరాల్లో చాలామంది పరిమిత-ఎడిషన్ సిరీస్1 వాహనానికి అర్హులు, ఎందుకంటే వారు కొత్త ఉత్పత్తి శ్రేణిని అధికారికంగా ప్రారంభించటానికి ముందు జనవరి 2020లోనే  ఆర్డర్లు ఇచ్చారు.
 
2021 తొలి త్రైమాసికం నాటికి అథేర్ ఈ నగరాల్లో వేగవంతమైన రీతిలో తెరవబడుతుంది. వినియోగదారులు వాహనానుభవాన్ని పొందడనైకి వీలుగా టెస్ట్ డ్రైవ్‌లను ఏర్పాటు చేస్తుంది. అథేర్ ఈ మార్కెట్లలోని భావి రిటైల్ భాగస్వాములతో చర్చలు ప్రారంభించడమేగాక, తన ఇ-చార్జింగ్ నెట్వర్క్‌ను ఏర్పాటు చెయ్యడానికి స్థలాల ఎంపిక కూడా చేస్తోంది అథేర్ గ్రిడ్. ఈ కొత్త 11 మార్కెట్లలో ఇప్పటికే అథేర్ 60 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది, మరికొన్ని పాయింట్ల పని నడుస్తోంది.
 
అథేర్ 450X అన్నది ఇదివరకటి అథేర్ 450 యొక్క అప్‌గ్రేడ్ చేయబడిన మోడల్. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని స్కూటర్ల కంటే వేగంగా నడిచే మరియు స్మార్టెస్ట్ స్కూర్టర్లలో ఒకటి. ఇది మూడు కొత్త రంగుల్లో రానుంది: గ్రే, గ్రీన్, వైట్. ఇది 29 కిలో వాట్ల లిథియం అయోన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనికి 4 రైడింగ్ మోడ్స్ వుంటాయి. ప్రస్తుతం ఉన్న ఏకొ, రైడ్, స్పోర్ట్ మోడ్స్‌తో పాటు అథేర్ అదనంగా ‘ర్యాప్’ అనే హైపెర్ఫామెన్స్ మోడ్‌ను కలిగి ఉంది. అథేర్ 450X ఈ ‘ర్యాప్’ మోడ్లో కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇదే దీని 125 సిసిలో కేటగిరీలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో నిశ్చింతగా దూసుకువెళ్లడానికి ఇది ఒక చక్కటి ఎంపిక. అథేర్ 450X ఇదివరకటి కంటే 50% వేగంగా చార్జింగ్ కావడంతో పాటు, నిముషానికి 1.5 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ప్రస్తుతానికి ఇదే వేగవంతమైన ఛార్జింగ్ రేటుగా నిలిచింది.
 
దాంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లూ టూత్ కనెక్టివిటీతో కూడిన 4జి సిమ్ కార్డ్ కలిగి ఉంది. దాంతో వాహనదారులు ప్రయాణం చేస్తూనే డ్యాష్ బోర్డ్‌కు ఉన్న టచ్ స్క్రీన్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, తమకు ఇష్టమైన సంగీతాన్ని వినవచ్చు. దీని సరికొత్త 7” టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ 16ఎం కలర్ డెప్త్ కలిగి ఉండడమే గాక స్నాప్ డ్రాగాన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. అథేర్ 450X గూగుల్ మ్యాప్ నేవిగేషన్ కొరకు ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్‌ను ఉపయోగించుకుంటుంది, దాంతోపాటు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్, ఓవర్ ద ఎయిర్ నవీకరణలు, ఆటో ఇండికేటర్ ఆఫ్ మరియు గైడ్ మీ హోమ్ లైట్స్ వంటి ప్రత్యకమైన ఏర్పాట్లను కూడా కలిగి ఉంది.
 
అథేర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫెసర్ రవ్నీత్ సింగ్ క్రోఖెలా ఈ సందర్భంగా మాట్లాడుతూ, “కొత్తగా మరో 16 మార్కెట్లను జోడించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. వచ్చే కొన్ని నెలల కాలంలో మేము ఈ నగరాల్లో స్థిరత్వాన్ని పొందుతామని నేను ఆశిస్తున్నాను. అథేర్ 450 ఎక్స్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి వినియోగదారుల నుంచి, డీలర్‌షిప్‌ల నుండి వచ్చిన బలమైన డిమాండ్ మరియు టెస్ట్ రైడ్ల కోసం వచ్చిన అభ్యర్థనలే ఈ విస్తరణకు కారణం. ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను నిర్మించడానికి అథేర్ ఎనర్జీ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంది. ఇది వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపుకు మారడాన్ని సులభతరం చేయడానికి ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు వినూత్న పరిష్కారాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా అథేర్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని మరియు ప్రీమియం సమర్పణ ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు