‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌

మంగళవారం, 31 జనవరి 2023 (21:49 IST)
భారతదేశంలో అగ్రగామి ప్రైవేట్‌ జనరల్‌ బీమా సంస్థలలో ఒకటైన బజాజ్‌ అలయన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు మాడ్యులర్‌ ఆరోగ్య భీమా ఉత్పత్తి ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’ను విడుదల చేసింది. ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’ను అంబ్రెల్లా ప్రొడక్ట్‌గా దరఖాస్తు చేశారు. దీనిలో భాగంగా అనుకూలీకరించిన ప్యాకేజీలను అందిస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా కవరేజీని ఎంచుకునే సౌలభ్యం దీనిలో ఉంది. ఈ కారణం చేత తమ సొంత ఆరోగ్య సంరక్షణ ప్లాన్‌ను డిజైన్‌ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. దీనిని అనుసరించి వారు తమ పాలసీకి ప్రీమియం సైతం కనుగొనవచ్చు. ఈ కంపెనీ ఇప్పుడు ప్లాన్‌ 1ను అంబ్రెల్లా ప్రొడక్ట్‌ కింద విడుదల చేసింది. దీనిలో తప్పనిసరి మరియు ఆప్షనల్‌ కవరేజీలు కూడా భాగంగా ఉంటాయి.
 
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’ ప్రొడక్ట్‌లో తప్పనిసరి కవరేజీలు అయిన హాస్పిటల్‌ వ్యయాలు, ముందు మరియు తరువాత హాస్పిటలైజేషన్‌ వ్యయాలు, ఆధునిక చికిత్స పద్ధతులు మరియ సాంకేతికతలో అత్యాధునిక ఆవిష్కరణ, అవయవదాన వ్యయాలు, ఆయుర్వేదిక్‌ మరియు హోమియోపతిక్‌ హాస్పిటలైజేషన్‌ కవర్‌, మెటర్నిటీ ప్యాకేజీ వ్యయాలు, బేబీ కేర్‌, ఔట్‌ పేషంట్‌ ట్రీట్‌మెంట్‌ వ్యయాలు (ఓపీడీ), హోమ్‌ నర్సింగ్‌ ప్రయోజనం, సమ్‌ ఇన్సూర్డ్‌రీ ఇన్‌స్టేట్‌మెంట్‌, ఎయిర్‌లిఫ్ట్‌ కవర్‌, క్యుమిలేటివ్‌ బోనస్‌ వంటివి ఉన్నాయి. మెటర్నిటీ ప్యాకేజ్‌ విభాగంలో భాగంగా ఈ ప్లాన్‌ లో భీమా చేయించుకున్న వ్యక్తులకు మెటర్నిటి వ్యయాలతో పాటుగా సరోగేట్‌ మదర్‌కు సైతం కవరేజీ అందిస్తారు. అలాగే, అసిస్టెడ్‌ రీప్రోడక్టివ్‌ ప్రొసీజర్‌ లేదా టెక్నిక్స్‌లో ఏవైనా సమస్యలు ఎదురైనా ఈ కవరేజీ లభిస్తుంది.
 
ఈ ప్లాన్‌లో మరో ప్రధాన ఆకర్షణ అంతర్గతంగా నిర్మించిన బేబీ కేర్‌ కవర్‌, దీనిలో భాగంగా నవజాత శిశువును సైతం శిశువు పుట్టిన తొలి రోజు నుంచి పాలసీ ముగింపు తేదీ వరకూ హెల్త్‌ ప్లాన్‌ అందిస్తుంది. ఈ ప్రొడక్ట్‌లో ప్రత్యేకమైన ఫీచర్‌గా, ఉదాహరణకు బేస్‌ ప్రీమియం చెల్లించిన దానికి రెండు రెట్లు మొత్తంగా ఓపీడీ మొత్తం ఉంటుంది. చికిత్స సమయంలో కన్స్యూమబల్‌ వ్యయాలు లేదా నాన్‌ మెడికల్‌ వ్యయాలు సైతం ఎంచుకున్న సమ్‌ ఇన్సూర్డ్‌ (ఎస్‌ఐ) వరకూ కవర్‌ చేస్తారు. అదనంగా, ప్రతి క్లెయిమ్‌ ఫ్రీ కోసం 50%వరకూ క్యుమిలేటివ్‌ బోనస్‌ను ఎస్‌ఐకు జోడిస్తారు. హోమ్‌ నర్సింగ్‌ ప్రయోజనం కింద, ఒకవేళ చికిత్స చేస్తున్న డాక్టర్‌ పాలసీ హోల్డర్‌ హాస్పిటల్‌ నుంచి ఇంటికి వెళ్లిన తరువాత కూడా నర్సింగ్‌ సహాయం అవసరమని  సూచిస్తే వీక్లీ నర్సింగ్‌ మొత్తాన్ని పాలసీ హోల్డర్‌కు అందజేస్తారు. మూడు ఆప్షనల్‌ కవర్స్‌ సైతం ఈ పాలసీప్లాన్‌1లో భాగంగా అందిస్తారు. అవి లాస్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ కవర్‌,  మేజర్‌ ఇల్‌నెస్‌ మరియు యాక్సిడెంట్‌ మల్టిపల్‌ కవర్‌ మరియు ఇంటర్నేషనల్‌ కవర్‌. ఇంటర్నేషనల్‌ కవర్‌ కింద ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పాలసీహోల్డర్‌కు అత్యవసర చికిత్స అవసరమైన పక్షంలో కవరేజీ అందిస్తారు.
 
ఈ ప్రొడక్ట్‌ గురించి బజాజ్‌ అలయన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌- సీఈఓ తపన్‌ సింఘెల్‌ మాట్లాడుతూ, ‘‘వైవిధ్యతకు మన దేశం నిలయం. ఇక్కడ వ్యక్తులను బట్టి అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ వైవిధ్యతే ఆవిష్కరణల పరంగా వైవిధ్యతను తీసుకువచ్చేందుకు మరియు ఆరోగ్య భీమా దేశంలో ప్రతి ఇంటికీ చేరేందుకు భరోసా కల్పిస్తుంది. మా మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ప్రొడక్ట్‌తో, మా ముఖ్య లక్ష్యమేమిటంటే , విస్తృత శ్రేణి అవకాశాలను పరిచయం చేయడం. దీనిలో వినియోగదారులకు ఎంచుకునే సౌలభ్యం ఉండటంతో పాటుగా తమ ఫ్యామిలీకి  అత్యుత్తమంగా తగిన కవరేజీ ఎంచుకునే సౌలభ్యమూ ఉంది. ఈ ప్రొడక్ట్‌ కింద, మేము బహుళ పథకాలను పరిచయం చేయనున్నాము. దీనిలో భాగంగా ప్లాన్‌ 1 ప్రారంభించాము. దీనిలో వినియోగదారులు తమ అవసరాలకనుగుణంగా పాలసీలను ఎంచుకోవచ్చు. ఈ ఉత్పత్తులలో వైవిధ్యత ఏమిటంటే, అవసరార్ధం మార్పు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ పాలసీలో మీరు కోరుకునే అంశాలు మాత్రమే ఉంచుకునే అవకాశమూ ఉంది’’ అని అన్నారు.
 
మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌లో భాగంగా 5 కోట్ల రూపాయల వరకూ సమ్‌ ఇన్సూర్‌ చేసే అవకాశం ఉంది. ఈ పాలసీని ఇండివిడ్యువల్‌ మరియు ఫ్లోటర్‌ పద్ధతిలో 1, 2 లేదా 3 సంవత్సరాల పాలసీ టర్మ్‌తో అందిస్తున్నారు. ప్రీమియంను నెలవారీ, త్రైమాస, అర్ధ, సంవత్సర పద్ధతుల్లో చెల్లించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు