ఆగస్టు నెల మరో మూడు రోజుల్లో ముగియనుంది. సెప్టెంబరు నెల ప్రారంభంకానుంది. ఈ నెలలో కూడా ఆగస్టులో వచ్చినట్టుగానే బ్యాంకులకు అనేక రోజులు పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబరు నెలలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని బ్యాంకు సేవలను పొందాలని బ్యాంకు అధికారులు కోరుతున్నారు.
భారత రిజర్వు బ్యాంకు క్యాలెండర్ ప్రకారం సెప్టెంబరులో మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి. ఇవి కాకుండా శని, ఆదివారాలు ఆరు రోజులు వస్తున్నాయి. దీంతో మొత్తం 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే, ఈ సెలవులు ఆయా రాష్ట్రాల బట్టి మారే అవకాశం ఉంది.
నెల ప్రారంభ రోజైన సెప్టెంబరు ఒకటో తేదీన గణేష్ చతుర్థి. ఈ కారణంగా గోవాలోని పనాజీలో బ్యాంకులు మూసివేస్తారు. ఆ ర్వాత 6న కర్మ పూజ. జార్ఖండ్‌లో సెలవు. ఓనం సందర్భంగా సెప్టెంబరు 7, 8 తేదీల్లో తిరువనంతపురం, కొచ్చిన్‌లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబరు 9న ఇంద్రజాత కారణంగా సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.
అలాగే, ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం నరవణే గురు జయంతి సందర్భంగా సెప్టెంబరు 10న కేరళలోని తిరువనంతపురం, కొచ్చిలలో బ్యాంకులు మూసివేస్తారు. 21న కూడా ఈ రెండు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి.
26న నవరాత్రుల స్థాపన కారణంగా మణిపూర్, జైపూర్, ఇంఫాల్‌లలో బ్యాంకులకు సెలవు. 24న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు.