బీఎస్ఎన్ఎల్ టారిఫ్ రేట్లు పెరుగుతాయా?

ఠాగూర్

మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:13 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఇటీవల భారీగా టారీఫ్ రేట్లను పెంచి తమ కస్టమర్లకు తేరుకోలేని షాకిచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ రేట్ పెంపు జోలికి వెళ్ళలేదు. దీంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా మొబల్ టారిఫ్ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైఆ కంపెనీ ఎండీ రాబర్ట్ రవి స్పందించారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ పెంపువుండదని స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారివిశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల సమీప భవిష్యత్‍‌లో మొబైల్ టారిఫ్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు