ఏప్రిల్ 23,2021 న విడుదల చేయనున్న కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:44 IST)
కెనరా రొబెక్కో ఎస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ నేడు తమ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ), కెనరా రొబెక్కో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ను ఆవిష్కరించింది. ఓపెన్ ఎండెడ్ పథకమిది. వైవిధ్యమై న రంగాలలో లార్జ్‌క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్‌లో గరిష్టంగా 30 స్టాక్స్‌ను ఇది పెట్టుబడి పెడుతుంది. ఈ 15 రోజుల ఎన్‌ఎఫ్‌ఓ కాలం శుక్రవారం, ఏప్రిల్ 23,2021వ తేదీన ఆరంభమై, శుక్రవారం మే 7,2021వ తేదీన ముగుస్తుంది.
కెనరా రొబెక్కో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (సీఆర్‌ఎఫ్‌ఈఎఫ్) ఆవిష్కరణ గురించి శ్రీ మోహిత్ భాటియా, హెడ్–సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ ఫోకస్డ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విభాగంలో మా నూతన ఉత్పత్తిని పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సీఆర్‌ఎఫ్‌ఈఎఫ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం, వృద్ధి అవకాశాలపై ఆధారపడి, మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాప్తంగా 30కు లోపు అత్యధిక కన్విక్షన్ స్టాక్స్‌పై దృష్టి సారిస్తుంది.
రిస్క్‌ను నిర్వహించేందుకు విభిన్న రంగాల వ్యాప్తంగా పోర్ట్‌ఫోలియో డైవర్శిఫికేషన్ సాధించాలనే లక్ష్యంతో ఉత్తమ ఆలోచనలను ఎంచుకోవడానికి క్రియాశీల కేటాయింపుల నుంచి ఈ ఫండ్ ప్రయోజనం పొందుతుంది. మా పెట్టుబడుల బృందం గుర్తించినట్లుగా సరైన పరిశోధన, ఎంచుకున్న అధిక కన్విక్షన్ వ్యాపారాలతో కూడిన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం ద్వారా మధ్యస్థం నుంచి దీర్ఘకాల పెట్టుబడుల ద్వారా ప్రయోజనం పొందాలనుకునే మదుపరులకు ఇది అనుకూలంగా ఉంటుంది.
శ్రీ నిమేష్ చందన్, హెడ్– ఇన్వెస్ట్‌మెంట్, ఈక్విటీస్ మాట్లాడుతూ, కెనరా రొబెకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో ఎంపిక చేసిన హై కన్విక్షన్ ఆలోచనలతో కూడిన పోర్ట్‌ఫోలియో విభిన్న రంగాలు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాప్తంగా ఉంటుంది. మధ్యస్థం నుంచి దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యవంతమైన రాబడులను అందిస్తుంది. గత కొద్దిసంవత్సరాలుగా మా ఫండ్స్ , మా మదుపరులకు అత్యుత్తమ రాబడులను సృష్టించాయి. ప్రధానంగా చక్కటి నాణ్యత, వృద్ధి ఆధారిత వ్యాపారాల ద్వారా ఈ రాబడులను సాధించాయి. ఫోకస్ ఫండ్ కోసం, మేము ఆ తరహా కంపెనీలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాము. అక్కడ మేము గణనీయమైన కేటాయింపులు జరుపడంతో పాటుగా సరైన ఎంపికల ద్వారా ప్రయోజనాలనూ పొందగలం అని అన్నారు.
ఈ పథకానికి హెడ్–ఈక్విటీస్ అండ్ ఫండ్ మేనేజర్ శ్రీ శ్రీదత్తా భండ్వాల్డర్ మాట్లాడుతూ మా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ను పెట్టుబడుల విధానం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి అత్యధిక మార్కెట్ వాటా కలిగిన మరియు పరిశ్రమలో అగ్రగామి ఆర్‌ఓఈ/రోస్ ప్రొఫైల్ కలిగిన నాయకులను గుర్తించడం, రెండవది, 15%కన్నా అధికంగా ఆమోదయోగ్యమైన ఆర్‌ఓఈ/రోస్ మరియు మార్కెట్ వాటా పొదడం కారణంగా లీడర్స్‌గా ఉంటూనే అత్యధిక సంపాదన వృద్ధికి అవకాశం ఉన్న ఛాలెంజర్లను గుర్తించడం మరియు మూడవది సైక్లికల్ టైల్ విండ్స్ చూస్తోన్న నూతన థీమ్‌లు, స్టాక్స్ మరియు రంగాలను గుర్తించడం.
ఈ తరహా విధానంతో పోర్ట్‌ఫోలియో సృష్టి ప్రయోజనాల కారణంగా మీడియం టర్మ్‌లో కాంపౌండింగ్ చేరుకోవడంలో సహాయపడటంతో పాటుగా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వం, అత్యధిక డౌన్‌సైడ్ రక్షణ మరియు అతి తక్కువ అస్థిరత సాధించడంలో సహాయపడతాయి. ఉద్భవిస్తోన్న నేపథ్యాలు మరియు సైక్లికల్ టైల్ విండ్ లబ్ధిదారులు అర్థవంతమైన ఆదాయాల వ్యత్యాసాల కారణంగా ఆల్ఫా జనరేషన్‌కు ప్రయోజనం చేకూర్చగలరుఅని అన్నారు.
వాంఛనీయ వెయిట్ కేటాయింపుతో సెక్టార్ ఎగ్నోస్టిక్ పోర్ట్‌ఫోలియో కన్‌స్ట్రక్ట్ విధానం, మార్కెట్ క్యాప్‌తో పాటుగా కెనరా రొబెకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌కు యాక్టివ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ ఉంది.
ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి మొత్తం 5వేల రూపాయలు మరియు ఆ తరువాత ఒక రూపాయి గుణిజాలతో లంప్‌సమ్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు మరియు సిప్ కోసం 1000 రూపాయలు మరియు ఆ తరువాత ఒక రూపాయి గుణిజాలతో పెట్టుబడులు పెట్టవచ్చు. కెనరా రొబెకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌కు బెంచ్‌మార్క్‌గా ఎస్ అండ్ పీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ నిలుస్తుంది.
శ్రీ శ్రీదత్త భండ్వాల్దర్ ఈ కెనరా రొబెకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను నిర్వహిస్తారు. కెనరా రొబెకో ఏఎంసీ వద్ద శ్రీ భండ్వాల్దర్, ఈక్విటీ ఫండ్ మేనేజ్‌మెంట్ బృదంలో అంతర్భాగంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్షంగా కెనరా రొబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, కెనరా రొబెకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్‌ను నిర్వహిస్తున్నారు. కెనరా రొబెకో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఎన్‌ఎఫ్‌ఓ ను ఏప్రిల్ 23,2021వ తేదీన తెరుస్తారు మరియు మే 07,2021 వ తేదీన ముగిస్తారు. ఈ నూతన స్కీమ్‌ను మంగళవారం మే 18,2021వ తేదీన తిరిగి తెరుస్తారు.