ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. రూ.20 నుంచి రూ.40 వరకు సిమెంట్ తగ్గింపు

మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:05 IST)
Cenent
ఇల్లు కట్టాలనుకుంటున్నారా.. అయితే సిమెంట్ ధరలు తగ్గుముఖం పడనున్నాయి. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి చిన్న ఊరటనిస్తూ సంస్థలు సిమెంట్‌పై ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించేశాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 తగ్గింది. 
 
తమిళనాడులో రూ.20 వరకు తగ్గగా, కేరళ, కర్ణాటకల్లో రూ.20 నుంచి రూ.40 మధ్య తగ్గినట్టు డీలర్లు చెబుతున్నారు. ధరల తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో బస్తా ధర రూ.280 నుంచి రూ.320 వరకు లభించనుంది.
 
అయితే, కరోనా వల్ల గత రెండేళ్లలో నిర్మాణ రంగం నెమ్మదించింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో సిమెంట్ వంటి వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది.  
 
వాస్తవానికి సంస్థలు నవంబర్ చివర్లో ధరలను పెంచాలని ముందుగా అనుకున్నాయి. అయితే, ఆశించినంత డిమాండ్ లేకపోవడం, డీలర్లు వ్యతిరేకించడంతో సంస్థలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు