తగ్గుతున్న ముడిచమురు ధరలు - ఎక్సైజ్ డ్యూటీ పెంచిన కేంద్రం

ఠాగూర్

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (19:14 IST)
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. పెట్రో ధరల పెంపుపై కేంద్ర స్పష్టత వచ్చింది. ధరల పెంపుపై కేంద్ర స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీ సమాచారం ఇచ్చినట్టు కేంద్రం పెట్రోల్, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 
 
కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ సుంకం పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినందున ఈ అదనపు భారాన్ని చమురు సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు