ఓటర్ కార్డుతో ఆధార్‌ అనుసంధానం.. దొంగ ఓట్ల బెడదకు చెక్

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:56 IST)
ఆధార్ ప్రస్తుతం భారత దేశంలో వ్యక్తుల యొక్క కార్యకలాపాల్లో ముఖ్య భాగమైపోయింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ జారీచేసే ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలతో పాటు, వ్యక్తిగత సమాచారం ఇందులో నిక్షిప్తం చేయబడి ఉంటుంది.

ఇప్పటికే రేషన్ కార్డు మొదలు, ఆర్ధిక కార్యకలపాలు, సంక్షేమం, ఉపాధి ఇతర అన్ని కార్యకలాపాలకు ఆధార్‌ను ప్రామాణికంగా భావిస్తుండగా భవిష్యత్తులో ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
 
ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు సాజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం వెల్లడించారు. ఇప్పటికే లా కమిషన్ పరిశీలన పూర్తయిందని త్వరలోనే అనుసంధాన ప్రక్రియపై కసరత్తు ప్రారంభమవుతున్నాట్లు స్పష్టం చేశారు.
 
ఓటరు కార్డుకు అధార్ లింక్ కారణంగా దొంగ ఓట్ల బెడదను నిరోధించటంతోపాటు, ఒక వ్యక్తి ఒక ప్రాంతంలోనే తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఓటుహక్కును వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తే వెంటనే సాంకేతికత అందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు. ఎన్నికల సంఘం సైతం ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానించమంటూ గతంలోనే ప్రతిపాదించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు