బాంబే స్టాక్ మార్కెట్ కు నేడు బ్లాక్ డే అనే చెప్పాలి. బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూరగొన్నాయి. రూపాయి బలహీనత, చైనాలో కోవిడ్ కేసుల పెరుగుద కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది.
తద్వారా బుధవారం సాయంత్రం బాంబే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల నష్టపోయి.. 61 వేల 702 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 18,385 పాయింట్ల వద్ద ముగిసింది.