ఏటీఎంల నుంచి ఎన్నిసార్లైనా నగదు డ్రా చేసుకోవచ్చు...

మంగళవారం, 24 మార్చి 2020 (16:37 IST)
డెబిట్‌ కార్డు దారులు ఇక నుంచి ఇతర ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు అయినా నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది. ఈ అవకాశం వచ్చే మూడు నెలల దాకా అందుబాటులో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వను ఉంచాలనే అంశంలో ఎలాంటి నియంత్రణ ఉండదని తెలిపారు.
 
మార్చి, ఏప్రిల్‌, మే నెలల జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే గడువును 2020 జూన్‌ 30 వరకూ పొడిగించారు. లాక్‌ డౌన్‌లో ఎగుమతిదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు కస్టమ్స్‌ శాఖ ఇరవై నాలుగు గంటలూ పని చేస్తుందని ఆర్థికమంత్రి వెల్లడించారు.
 
కరోనా కోరల్లో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా.. ఇకపై బ్యాంకింగ్ ఛార్జీలను కూడా తగ్గిస్తారు. ఆధార్‌- పాన్‌ కార్డు అనుసంధానికి తుది గడువును 2020 జూన్‌ 30 దాకా పొడిగించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఆదాయపన్నుపై ఆలస్యమయ్యే చెల్లింపులపై విధించే వడ్డీ రేటును పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతానికి తగ్గించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు