దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. దీంతో ఖాతాదారులకు సహాయం చేయడానికి ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేవైసీ వివరాలు నిబంధనల మేరకు ఉన్న వారి అప్లికేషన్లను 72 గంటల్లోగా ప్రాసెస్ చేస్తున్నామని ఈపీఎఫ్‌వో సంస్థ తెలిపింది.
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు ఇప్పటివరకు రూ.279.65 కోట్లు చెల్లించినట్లు ఈపీఎఫ్‌వో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఖాతాదారులు అవసరమైన మేరకు నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఈపీఎఫ్ పథకం నుంచి ప్రత్యేక ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.