ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా పేరుగడించిన విజయవాడ, గన్నవరం విమానాశ్రయం నుంచి పలు విదేశాలకు విమాన సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో కొన్ని డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ఉండగా, మరికొన్ని లింకు ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ నుంచి దుబాయ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును నడుపనున్నారు. ఈ సర్వీను ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విమానం వారంలో రెండుసార్లు నడుపుతారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు.
అలాగే, ఢిల్లీ నుంచి అదనంగా మరో విమాన సర్వీసును విజయవాడ నుంచి నడుపాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన భేటీలో పాల్గొన్న అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే విజయవాడ నుంచి వారంలో రెండు విమాన సర్వీసులు గన్నవరం నుంచి అందుబాటులో ఉంటాయి.
విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు.