డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ముకేశ్ అంబానీ

మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (14:05 IST)
అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో తమ వ్యాపారం డిస్నీ ఇండియాను విక్రయించాలని చూస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. 
 
టెలివిజన్ సహా డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించేందుకు పలువురు కొనుగోలుదారుతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. 
 
ఇప్పటికే భారత్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ హక్కులను సైతం ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సంబంధిత స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు