ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ?

సోమవారం, 14 డిశెంబరు 2020 (08:19 IST)
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లోకి వడ్డీ జమకానుంది. 2019-20 సంవత్సరానికిగాను 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఈనెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. 
 
కరోనా నేపథ్యంలో 8.5 శాతం వడ్డీని రెండు వాయిదాల్లో (8.15 శాతం, 0.35 శాతం) జమచేయాలని గత సెప్టెంబరులో ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అయితే పరిస్థితులు మారినందు వల్ల ఒకేసారి 8.5 శాతం వడ్డీని జమ చేయాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం అనుమతి కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కార్మిక శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు