ఇటీవల చంద్రుడి పరిశోధన నిమిత్తం చైనా చాంగే-5 ల్యాండర్‌ను నాలుగు దశాబ్దాల విరామం తర్వాత పంపించింది. ఇది విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టింది. ఈ నెల మొదట్లో అది చంద్రుడి ఉపరితలంపై దిగి 4.4 పౌండ్ల మట్టి, రాళ్లను సేకరించింది. ప్రస్తుతం ఇది తిరిగి భూమికి చేరుకోనుంది.
ఈ ల్యాండర్ సేకరించి తీసుకొస్తున్న మట్టి, రాళ్లను విశ్లేషించడం ద్వారా గతంలో అంతుచిక్కని విషయాలతోపాటు చంద్రుడి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.