ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితే వేతన జీవులకు రూ.15,450 (30 శాతం) వరకూ ఆదా అవుతుంది. సెక్షన్ 80 సీ కింద బీమా, ఈక్విటీ లింక్డ్ మదుపు పథకాలు, పోస్టల్ డిపాజిట్లు, సుకన్యా సమృద్ధి, జాతీయ పొదుపు పథకాలు, పన్ను ఆదా చేసేలా ఐదేళ్ల కాలపరిమితిలో ఉండే బ్యాంకు డిపాజిట్లు తదితర మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ మొత్తాన్ని ఐటీ రిటర్నుల్లో చూపి రాయితీలను పొందవచ్చు.