పడిపోయిన పసిడి ధరలు.. రూ.110కు దిగొచ్చింది..

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (17:29 IST)
పసిడి ధరలు పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని ఆలోచించే వారికి ఇది శుభవార్తగా మిగిలింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. 
 
బుధవారం పెరిగిన ధర గురువారం మాత్రం పడిపోయింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడుస్తోంది. వెండి కూడా భారీగా తగ్గిందిది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 దిగొచ్చింది. దీంతో రేటు రూ.47,730కు క్షీణించింది. 
 
అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గుదలతో రూ.43,750కు తగ్గింది. బంగారం ధర నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కేజీకి రూ.1,300 క్షీణించింది. దీంతో రేటు రూ.74,400కు పడిపోయింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు