Kartikeya, Vinisha and team
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'క' చిత్రం విజయవంతం అందరికి తెలిసిందే. ఇప్పుడు 'క' చిత్రాన్ని నిర్మించిన మేకర్స్ మరో డిఫరెంట్ అండ్ న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఫిల్మ్‌తో రాబోతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినయ్ రత్నం దర్శకుడు. వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను సోమవారం కథానాయకుడు కార్తీకేయ విడుదల చేశారు.