బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్: పసిడి ధర పైపైకి

సోమవారం, 13 జూన్ 2022 (08:25 IST)
బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు సోమవారం పెరిగాయి. అయితే వెండి ధర నిలకడగా ఉంది. బంగారం ధర రూ.660 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760కి పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,360 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది.
 
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,760 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,360 అయింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి
 
విశాఖపట్నం, తిరుపతిలో రూ.660 మేర ఎగబాకడంతో సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,360 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు