స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణగ్రహీతలకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహ రుణాలకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇది సమాన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) చెల్లించే కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తుంది. బ్యాంక్ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)లను సవరించింది.
ఇందులో భాగంగా ఎస్బీఐ రుణ రేట్లను సర్దుబాటు చేసినట్లు స్పష్టం చేసింది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) లేదా బేస్ రేట్ (బీపీఎల్ఆర్)లో ఎటువంటి మార్పులు ఉండవని బ్యాంక్ ధృవీకరించింది.