బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్, కాల్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఇలాంటి అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్‌లోకి రానున్న హోండా బైక్ ఇదేనంటూ నిపుణులు చెబుతున్నారు. ఇంకా 12 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. అలాగే ఇందులో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
అస్తవ్యస్థంగా ఉన్న రోడ్లలో ప్రయాణం సుఖవంతంగా సాగే వీలుగా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అమర్చవచ్చు. ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మోడల్‌లో పోలిస్తే కొత్త యాక్టివా 6జీ రూ.7,000 ఎక్కువే ఉంటుందని సమాచారం. ప్రస్తుత యాక్టివా 5జీ బేస్ మోడల్ ధర రూ.54,632గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.