కీలక నిర్ణయం తీసుకున్న హోండా మోటార్ కంపెనీ. ఆ బైకులన్నీ వెనక్కి!

ఠాగూర్

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (09:51 IST)
ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. పలు మోడళ్ల బైక్లను రీకాల్ చేపట్టింది. కంపెనీ 300 - 350 సీసీ బైక్లను వెనక్కి తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఆ మోడళ్లను ఎందుకు రీకాల్ చేపట్టిందో కూడా కంపెనీ వెల్లడించింది. స్పీడ్ సెన్సర్ క్యామ్ షార్ట్‌లో లోపాల మూలంగా ఈ రీకాల్ చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. 
 
సీబీ 300 ఎఫ్, సీబీ 300ఆర్, సీబీ 359, హెచ్నెస్ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లు రీకాల్ చేపట్టిన వాటిలో ఉన్నాయి. 2020 అక్టోబరు నుండి 2024 ఏప్రిల్ మధ్య తయారైన వారిలో ఈ మోడళ్లు ఉన్నాయి. మోల్డింగ్ విధానంలో పొరపాటు కారణంగా స్పీడ్ సెన్సర్‌లోకి నీరు చొరబడే అవకాశం ఉందని, దీని వల్ల స్పీడ్ సెన్సర్‌తో పాటు ట్రాక్షన్ లేదా ఏబీఎస్ కూడా పని చేయక పోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని సందర్భాల్లో బ్రేకింగ్‌లోనూ లోపాలు రావచ్చని వెల్లడించింది.
 
అలాగే, 2024 జూన్, జులై మధ్య తయారైన సీబీ 350, హెచ్‌నెస్ సీబీ 350, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లలో క్యామ్ షార్ట్ పని తీరులో కూడా లోపం ఉన్నట్లు గుర్తించామని కంపెనీ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా సంబంధిత పార్టులను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. వారంటీతో సంబంధం లేకుండా కంపెనీకి చెందిన అన్ని బిగ్ వీల్ డీలర్ షిప్ కేంద్రాల్లో ఈ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు