అలాగే, ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలలో తొలి 4 క్యాష్ విత్‌డ్రాయెల్‌పై ఎలాంటి చార్జీలు ఉండవు. తర్వాత బ్యాంక్ కస్టమర్లు రూ.1000 విత్‌డ్రాపై రూ.5 చార్జీ చెల్లింపుకోవాలి. ప్రతి నెలా రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా పొందొచ్చు.
బ్యాంక్ కస్టమర్లు నెలలో తొలి మూడు లావాదేవీలు (నాన్ బ్యాంక్ ఏటీఎం) చార్జీలు లేకుండా పొందొచ్చు. మెట్రో నగరాలకు ఇది వర్తిస్తుంది. ఈ లిమిట్ దాటితే ఒక్కో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8.5 చెల్లించుకోవాలి. ఇతర ప్రాంతాల్లో అయితే 5 లావాదేవీలు నిర్వహించొచ్చు. చార్జీలు పడవు.