వినియోగదారుల వైవిధ్యమైన అవసరాలను తీర్చేందుకు ఐసీఐసీఐ గ్యారెంటీడ్ పెన్షన్ ఫ్లెక్సీ ఇప్పుడు ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా మాట్లాడుతూ ఈ మహమ్మారి ఎంతోమంది జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. దానితో పాటుగా సేవింగ్స్, ఆదాయం మరీ ముఖ్యంగా రిటైర్మెంట్ జీవితం జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాల్సిన ఆవశ్యకత కల్పించింది.
సాధారణంగా యాన్యుటీ ఉత్పత్తులను ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ ఫ్రు గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా వినియోగదారులకు రెగ్యులర్ కంట్రిబ్యూషన్ తో తాము కోరుకున్న మొత్తాలను పొదుపు చేసే అవకాశం కల్పిస్తుంది. తద్వారా ఎంతోమంది ముందుగానే తమ రిటైర్మెంట్ జీవితాన్ని ప్రణాళిక చేసుకునే వీలు కలుగుతుంది అని అన్నారు.