సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ

మంగళవారం, 18 జనవరి 2022 (15:32 IST)
వంట గ్యాస్ సిలిండర్ రెండు గంటల్లో డెలివరీ కానుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ "ఇండియన్ ఆయిల్"తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 
 
తమ తత్కాల్ సేవలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ వస్తుంది. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఐవీఆర్ఎస్, వెబ్‌సైట్ లేదా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ తత్కాల్ సేవకు గానూ వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లో ఎంపిక చేయబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు