అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడిచమురు ధరలు

ఆదివారం, 12 జూన్ 2022 (11:34 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో దేశీయంగా కూడా ఈ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇటీవలే పెట్రోల్, డీజల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగింది. 
 
ఇపుడు మళ్లీ ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా వీటి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియన్  పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.72గాను, డీజల్ ధర రూ.89.62గా ఉంది. 
 
మీరు ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ప్రతి రోజూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజల్ ధరలను తెలుసుకోవచ్చు. ఐఓసీఎస్ వినియోగదారులకు ఆర్ఎస్పీ లభిస్తుంది. కోడ్ రాసి 9224992249 అనే మొబైల్ నంబరుకు పంపితే పెట్రోల్ ధరల వివరాలు మెసేజ్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు