ఒరిస్సా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఒరిస్సా ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్ 17 వరకూ తెరవబోమని ఆయన స్పష్టంచేశారు.