జూలైలో జోరుగా పెరిగిన మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్ డీలర్‌షిప్‌లు

ఐవీఆర్

శుక్రవారం, 26 జులై 2024 (11:12 IST)
సీఏజీఆర్ ప్రాతిపదికన 2024 ఆర్థిక సంవత్సరంలో 46 శాతం వ్యాపార పరిమాణం పెరుగుదలతో నాలుగేళ్ల పటిష్ట వృద్ధి సాధించిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) జూలై నెలలో భారత్‌లో నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా అయిదు అధునాతన డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. వీటిలో రోజుకు 75 పైగా వాహనాలకు సర్వీసులు అందించేలా 37 సర్వీస్ బేలు ఉన్నాయి. అలాగే ఇవి డ్రైవర్ లాడ్జింగ్, 24 గంటల బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, యాడ్‌బ్లూ మొదలైనవి కూడా అందించగలవు.
 
“భారతీయ సీవీ మార్కెట్లో ఎంటీబీడీకి పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ ఇప్పటికే పలు రంగాలు, మార్కెట్లలో 3వ స్థానంలో ఉంది. మా నెట్‌వర్క్‌కు కొత్తగా ఈ 5 డీలర్‌షిప్‌లు తోడు కావడమనేది మా నెట్‌వర్క్‌ను మరింత పెంచగలదని, మా కస్టమర్ల వాహనాల సర్వీసింగ్‌కు, వారు తమ ఫ్లీట్‌లను మరింత సమర్ధంగా పనిచేయడంలో తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలవని విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింత ఉత్సాహంగా ఉన్నాం. మా విలువైన కస్టమర్లకు వినూత్నమైన, సమర్ధమంతమైన రవాణా సొల్యూషన్స్‌ను అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాం” అని మహీంద్రా & మహీంద్రా బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) శ్రీ జలజ్ గుప్తా తెలిపారు.
 
బీఎస్6 ఓబీడీ II శ్రేణి ట్రక్కులకు సంబంధించి రవాణాదారుల లాభదాయకతను మరింత పెంచేందుకు తోడ్పడే హామీనిచ్చే “జ్యాదా మైలేజ్ నహీ తో ట్రక్ వాపస్” పేరిట కొత్త మైలేజ్ గ్యారంటీని ఆవిష్కరించిన సందర్భంగా తమ వాహనాల అత్యుత్తమ సాంకేతిక సామర్ధ్యాలను గుప్తా వివరించారు. పటిష్టమైన డీలర్ భాగస్వాములకు తోడు అధునాతన 3S యూనిట్లు, కస్టమర్ సర్వీస్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు, ఎంటీబీ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు తోడ్పడగలవని ఆయన తెలిపారు.
 
మహీంద్రా బ్లేజో ఎక్స్, ఫ్యూరియో, ఆప్టిమో, జేయో సీవీ ట్రక్కుల శ్రేణి మాత్రమే భారత్‌లో తమ తమ విభాగాల్లో అత్యుత్తమంగా ఇంధనం ఆదా చేయడంతో పాటు డబుల్ సర్వీస్ గ్యారంటీలను అందిస్తున్నాయి. బ్రేక్‌డౌన్ అయిన 48 గంటల్లోగా ట్రక్కును తిరిగి రహదారిపైకి తెచ్చేలా గ్యారంటీ అప్‌టైమ్ సర్వీసును ఎంటీబీడీ అందిస్తోంది. అలా జరగని పక్షంలో కస్టమరుకు కంపెనీ రోజుకు రూ. 1,000 చొప్పున చెల్లిస్తుంది. అంతే గాకుండా, డీలర్ వర్క్‌షాప్‌లో వాహన టర్నెరౌండ్ సమయం కచ్చితంగా 36 గంటల్లోపే ఉంటుంది. లేని పక్షంలో కంపెనీ రోజుకు రూ. 3,000 చెల్లిస్తుంది. నిరంతరం ఉత్పత్తుల్లో వినూత్నతను పాటించడం, కస్టమరుకు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతుండటమనేది ఎంటీబీడీ ఇచ్చే హామీలను అమలు చేయడంలో గణనీయంగా తోడ్పడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు