డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇటీవల నిర్వహించిన వేలంలో, ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850MHz బ్యాండ్‌లో 5 MHz ను; 1800MHz బ్యాండ్‌లో 5MHz; 2300 MHz బ్యాండ్‌లో 10 MHz స్పెక్ట్రమ్‌ను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రమ్ విస్తరణ ప్రాజెక్ట్‌ను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అమలు చేసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచే సురక్షితంగా ఆఫీస్ పనిచేసే వారికి, ఆన్లైన్ క్లాస్‌లు హాజరయ్యే విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు డేటా అవసరం మరింత ఉంది. నెట్వర్క్ సామర్ధ్యం పెరగడం వల్ల ఈ వర్గాల వారందరికీ మెరుగైన, నాణ్యమైన కనెక్టివిటీని అందించేందుకు జియో కృషి చేస్తోంది.
ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో 22 సర్కిల్‌ల కోసం జియో మొత్తం 488.35MHz (850MHz, 1800MHz మరియు 2300MHz బ్యాండ్ లలో) స్పెక్ట్రంను 20 సంవత్సరాల కాలానికి రూ.57,123 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ లభ్యత 55 శాతం వృద్ధితో 1717 MHz కు గణనీయంగా పెరిగింది.