కరనా కష్టకాలం తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటోందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సేవలు, వినియోగం, పెట్టుబడుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయని సర్వే తెలిపింది.
గతేడాది కొవిడ్ కారణంగా ఒక్క వ్యవసాయ రంగం తప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సర్వే తేల్చింది. ఈ ఏడాది ప్రభుత్వం తన 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది. గతేడాది -23.9 శాతానికి పతనమైన వృద్ధి రేటు తర్వాత మెల్లగా కోలుకున్న విషయం తెలిసిందే.