కోటక్ బ్యాంక్ ప్రారంభించిన సాలిటైర్

ఐవీఆర్

గురువారం, 24 జులై 2025 (20:06 IST)
భారతదేశంలోని నిజమైన సంపన్నుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శక బ్యాంకింగ్ ప్రతిపాదన అయిన కోటక్ సాలిటైర్‌ను ప్రారంభించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈరోజు ప్రకటించింది. ఇది కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదు-ఇది ఒక ప్రత్యేక హక్కు. కోటక్ సాలిటైర్ అనేది ఒక ఆహ్వానంతో కూడివున్న సేవ, ఇది కోటక్‌తో లోతైన, బహుళ-డైమెన్షనల్ ఆర్థిక సంబంధం కలిగిన వ్యక్తులు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడింది. ఇది కేవలం ఖాతా బ్యాలెన్సుల గురించి కాదు, డిపాజిట్లు, పెట్టుబడులు, రుణాలు, బీమా, డీమాట్ హోల్డింగ్స్ వంటి అన్ని విభాగాల్లో ఉన్న మొత్తం సంబంధ విలువ ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు.
 
"భారతదేశంలోని సంపన్న వర్గం వేగంగా అభివృద్ధి చెందుతోంది, అయితే వారి బ్యాంకింగ్ అనుభవం మాత్రం ఆ వేగాన్ని అనుసరించలేకపోయింది," అని మిస్టర్. రోహిత్ భాసిన్, ప్రెసిడెంట్- అఫ్లుయెంట్ హెడ్, NRI, బిజినెస్ బ్యాంకింగ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొన్నారు. "సాలిటైర్ అనేది ఆ అంతరానికి మా ప్రత్యుత్తరం. ఇది కేవలం ఒక ఉత్పత్తి కాదు, ఇది ఒక సమగ్ర ప్రతిపాదన. ఇది విజయాన్ని గౌరవిస్తుంది, ఆశయాన్ని ఆదరిస్తుంది, ఒక సంపన్న వినియోగదారుడు పొందగల అత్యుత్తమ బ్యాంకింగ్ అనుభవాన్ని తిరిగి నిర్వచిస్తుంది," అని ఆయన తెలిపారు.
 
లోతైన కస్టమర్ అంతర్దృష్టి నుండి పుట్టింది
విస్తృతమైన పరిశోధనల ఫలితంగా, సంపన్న వినియోగదారులు తమ బ్యాంకులతో బలహీనమైన సంబంధాన్ని, లేదా పూర్తి అవగాహనలేని అనుభూతిని ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది. వారు తమ అవసరాలు గుర్తించబడకుండా, తక్కువ ప్రాధాన్యత కలిగినవారిలా, భావోద్వేగపరంగా కూడ డిస్కనెక్ట్ అయ్యారని భావించారు. ఈ వాస్తవాలను కోటక్ స్పష్టంగా విన్నది, అద్భుతంగా స్పందించింది. వారి ప్రధాన పెయిన్ పాయింట్లను నేరుగా పరిష్కరించేందుకు ‘కోటక్ సాలిటైర్’ అనే ప్రత్యేక పరిష్కారాన్ని సమర్పించింది.
 
గుర్తింపు మరియు వ్యక్తిగతీకరణ లేకపోవడం
ఆర్థిక ఉత్పత్తులలో విచ్ఛిన్నమైన సేవ.
కుటుంబ స్థాయి బ్యాంకింగ్ అనుభవం లేకపోవడం
జీవనశైలి మరియు ఆకాంక్షలను విస్మరించే సాధారణ సమర్పణలు
సాలిటైర్: సంపన్న బ్యాంకింగ్ లో కొత్త ప్రమాణం
సాలిటైర్ అనేది కేవలం ప్రయోజనాల సమితి మాత్రమే కాదు, ఇది వినియోగదారుడు మరియు వారి కుటుంబాన్ని కేంద్రబిందువుగా పెట్టుకుని రూపొందించిన సమగ్రమైన, పునః రూపకల్పిత బ్యాంకింగ్ అనుభవం:
 
₹ 8 కోట్లు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులలో ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్స్
జీతం పొందే నిపుణులు, వ్యవస్థాపకుల కోసం విభాగ-నిర్దిష్ట పరిష్కారాలు
భాగస్వామ్య రుణ పరిమితులు, అధికారాలతో కుటుంబ-మొదటి బ్యాంకింగ్
సజావు, అధిక-స్పర్శ మద్దతు కోసం అంకితమైన రిలేషన్ షిప్ & సర్వీస్ మేనేజర్లు
బ్యాంకింగ్, వెల్త్, ఇన్షూరెన్స్ మరియు లైఫ్‌స్టైల్ విభాగాల్లో కోటక్ అందించే ఉత్తమ సేవలను ఒకే చోట ఒకతాటి అనుభవంగా అందించే ఏకీకృత ప్లాట్‌ఫామ్.
 
సాలిటైర్ క్రెడిట్ కార్డ్: వైవిధ్యం కోసం రూపొందించబడింది
సాలిటైర్ అనుభవంలో భాగంగా, కోటక్ సాలిటైర్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది-ఇది కార్యక్రమం యొక్క నైతికతకు ప్రతిబింబం:
 
ఆహ్వానంతో మాత్రమే లభించే ప్రత్యేకత: కేవలం సాలిటైర్ కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది
సాలిటైర్ కస్టమర్లకు ఏటా ఫీజులు లేవు
అధిక క్రెడిట్ పరిమితులు
లిమిట్‌లేని లౌంజ్ యాక్సెస్: ప్రైమరీ, ఆడ్-ఆన్ కార్డుదారులకు పరిమితుల్లేని లౌంజ్ యాక్సెస్. గెస్ట్ ట్రావెలర్స్‌కీ యాక్సెస్ ఉండటంతో మొత్తం కుటుంబం లౌంజ్ సౌకర్యాన్ని అనుభవించవచ్చు
 
ట్రావెల్ ఖర్చులపై 10% ఎయిర్ మైల్స్: కోటక్ అన్‌బాక్స్ ద్వారా జరిపిన ట్రావెల్ ఖర్చులపై 10% ఎయిర్ మైల్స్, ఇతర అర్హత కలిగిన ఖర్చులపై 3% ఎయిర్ మైల్స్ – ప్రతి స్టేట్మెంట్ సైకిల్‌కు రూ.1,00,000 ఎయిర్ మైల్స్ వరకు లభ్యం
 
జీరో ఫారెక్స్ మార్కప్: ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క కార్డ్‌తోనే ఖర్చులు చేయవచ్చు
ఇంధన సర్‌చార్జ్ మాఫీ: రూ.7500 వరకూ ఫ్యూయెల్ లావాదేవీలపై సర్‌చార్జ్ మాఫీ
ఎయిర్ మైల్స్ రిడంప్షన్‌లో అనేక ఎంపికలు: విమాన టిక్కెట్లు, హోటల్స్ బుకింగ్‌లు, ప్రముఖ విమాన/హోటల్ లాయల్టీ ప్రోగ్రాంలకు మైల్స్ ట్రాన్స్‌ఫర్ వంటి లాభాల వెల్లువ
 
“ఈ కార్డ్ కేవలం రివార్డులు మాత్రమే ఇవ్వదు. మీ ప్రయాణాన్ని గౌరవిస్తుంది,” అని కోటక్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా అన్నారు. “ఇది తమ స్థానం తమ శ్రమతో సాధించుకున్నవారికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అలానే వారి కుటుంబం కూడా అదే స్థాయి సేవను, గౌరవాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో రూపొందించాం.”
 
ప్రత్యేకత పునర్నిర్వచించబడింది
సాలిటైర్‌ ప్రోగ్రామ్‌ ఆహ్వానం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కోటక్ యొక్క ఎకోసిస్టమ్‌లో వారు కలిగి ఉన్న సంబంధ విలువ, వారి భాగస్వామ్య స్థాయిని బట్టి ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఇది అందించబడుతుంది. ఇది పరిమాణాన్ని కాకుండా నాణ్యతను, సమిప్యతను కాకుండా గుర్తింపును ప్రాధాన్యంగా తీసుకునే ప్రత్యేక కార్యక్రమం. కోటక్ యొక్క నమ్మకం మరియు శ్రేష్ఠత యొక్క వారసత్వంపై సాలిటైర్ రూపొందించబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు