దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆగస్టు 15వ తేదీన కొత్తగా ఐదు ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. దేశ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని వీటిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎక్స్‌యూవీ ఈ8, ఎక్స్‌యూవీ ఈ9, ఎక్స్‌యూవీ బీఈ05, ఎక్స్‌యూవీ బీఈ07, ఎక్స్‌యూవీ బీఈ09 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను పరిశీలిస్తే,
దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన ఎం అండ్ ఎం తాజాగా ఐదు ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తొలుత ఎక్స్‌యూపీ ఈ8. ఇది వచ్చే 2024 డిసెంబరు నాటికి అందుబాటులోకి రానుంది. ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత మిగిలిన నాలుగు రకాల మోడళ్ళను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
ఈ కార్లలో 60 నుంచి 80 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అమర్చనున్నారు. ఫలితంగా 175 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఇది వినియోగదారుడుకు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. అయితే, ఈ కార్లలో పొందుపరిచే ఫీచర్లు, ఇతర అత్యాధునిక సౌకర్యాలు, ధరలు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.