భారతదేశపు SUV విభాగాన్ని పునర్నిర్వచిస్తూ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఈరోజు కొత్త SUV, విక్టోరిస్‌ను విడుదల చేసింది. కొత్త మూల్యాంకనాలను నెలకొల్పడానికి రూపొందించబిడన విక్టోరిస్ హైపర్-కనక్టెడ్ టెక్నాలజీ, సంపూర్ణమైన భద్రత, అధునాతనమైన, నాజూకైన డిజైన్‌తో, అన్నీ కలిగి ఉన్న SUVని అందచేసే ఉల్లాసకరమైన పెర్ఫార్మెన్స్‌తో నిరంతరంగా కలిసిపోతుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఆల్ గ్రిప్ సెలక్ట్, పర్యావరణానుకూలమైన S-CNG టెక్నాలజీతో పెట్రోలులో లభిస్తోంది. శ్రేణిలోనే మొదటి అండర్ బాడీ డిజైన్‌తో, విక్టోరిస్ నేటి చురుకైన యువతకి అనుకూలమైన విస్తృత శ్రేణి పవర్ ట్రైన్ వ్యవస్థల్ని అందిస్తోంది. కస్టమర్లు తమ సరికొత్త విక్టోరిస్‌ను రూ. 11000కి బుక్ చేయవచ్చు.
విక్టోరిస్‌ను పరిచయం చేస్తూ, శ్రీ. హిసాషి టకేచి, మేనేజింగ్ డైరెక్టర్-సీఈఓ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, ఆధునిక భారతదేశపు యువత ఉల్లాసవంతమైనవారు, బాగా ప్రయాణించారు, ఇంటర్నెట్ కనక్షన్ గల డివైజ్ లకు బాగా అలవాటుపడిన వారు, సామాజికంగా చైతన్యం కలిగి, సాంకేతికపరంగా ప్రగతిశీలకంగా, పర్యావరణపరంగా సున్నితంగా ఉన్నారు. అలాంటి కస్టమర్ల అభిలాషలు నెరవేర్చడానికి మా కొత్త SUV విక్టోరిస్, తప్పనిసరిగా గాట్ ఇట్ ఆల్‌గా ఉండవలసి వచ్చింది. విక్టోరిస్ లాటిన్ పదం నుండి వచ్చింది అనగా విజేత అని అర్థం. విక్టోరిస్ తన ఉన్నతమైన టెక్నాలజీ, నాజూకైన డిజైన్, తెలివి మరియు కనక్టెడ్ ఫీచర్లు, 5-స్టార్ స్థాయి భద్రత, బహుళ పర్యావరణహితమైన పవర్ ట్రైన్స్ భారతదేశంలో హృదయాలను గెలుచుకున్నాయి. విక్టోరిస్‌తో మేము మా SUV పోర్ట్ ఫోలియోను, మా పూర్తి మార్కెట్ భాగస్వామాన్ని శక్తివంతం చేస్తున్నాం.
కస్టమర్లు బుక్కింగ్ చేయడానికి ఆప్షన్స్:
సరికొత్త విక్టోరిస్ ను రూ. 11000 ప్రారంభపు చెల్లింపుతో బుక్ చేయవచ్చు.
marutisuzuki.com/arenaకి లాగింగ్ చేయడం ద్వారా-
లేదా మీకు దగ్గరలో ఉన్న మారుతి సుజుకీ ARENA షోరూంని సందర్శించడం ద్వారా
ఈ విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ పార్థో బెనర్జీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మార్కెటింగ్-సేల్స్, మారుతి, సుజుకీ ఇండియా లిమిటెడ్, ఇలా అన్నారు, మారుతి సుజుకీలో, మేము ఎల్లప్పుడూ కస్టమర్లు చెప్పింది వింటాము. నేటి యువ మరియు చురుకైన కస్టమర్లు తమ వంటి ఉత్సాహవంతమైన, ప్రశాంతమైన, ఆత్మవిశ్వాసం కలిగిన, ఎల్లప్పుడూ ప్రగతిశీలకంగా ఉండటాన్ని సూచించే ఆటోమొబైల్‌కు ప్రాధాన్యతనిస్తారు. కొత్త విక్టోరిస్ కోసం మేము మా డిజైన్, ఇంజనీరింగ్ టీమ్స్‌కు ఇదే విషయం వివరించాము. నేడు SUVలు అత్యంత ఇష్టపడే శ్రేణి కావచ్చు కానీ SUV బయ్యర్ అభివృద్ధి చెందాడు. ఈ ఆధునిక తరానికి చెందిన యువ కస్టమర్లకు లక్ష్యాలు ఉన్నాయి. ఎంతగానో కనక్ట్ అయి ఉన్నారు.