ఈ మోడల్ కార్లన్నీ 2004 నుంచి 2015 వరకు తయారైన ఎస్.యు.వి సిరీస్‌లోని ఎంఎల్, జీఎల్, ఆర్- క్లాస్ లగ్జరీ మినీ వ్యాన్ మోడళ్లు ఉన్నాయి. ఈ కార్లకు అమర్చిన బ్రేకులు తుప్పుపట్టడంతో బ్రేకింగ్ సిస్టమ్ సరిగా పని చేయడం లేదని, అందువల్ల వెనక్కి తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చింది.
లోపాలను సరిచేసి వెనక్కి ఇచ్చేస్తామని, అందువల్ల ఆ మోడళ్లను ఆయా కార్ల యజమానులు అప్పగించాలని ఆ కంపెనీ కోరింది. దీంతో మొత్తం 9,93,407 రీకాల్ చేస్తున్నట్టు, ఇందులో ఒక్క జర్మనీలోనే దాదాపు 70 వేల కార్లు ఉన్నాయని తెలిపింది.