మార్కెట్లోకి డైనమిక్ డిజైన్, ఆకర్షణీయమైన మెర్సెడెజ్ బెంజ్ జిఎల్ఎ కారు
బుధవారం, 5 జులై 2017 (20:10 IST)
ప్రముఖ మెర్సిడెస్ బెంజ్ తన SUV పోర్ట్ ఫోలియోను మరింత దృఢపరుస్తూ కొత్త జిఎల్ఎను ప్రారంభించింది. స్టైలిష్ SUV డైనమిక్ డిజైన్, శక్తివంతమైన ఆకర్షణీయంగా మూడు ఇంజిన్లయిన GLA 200, GLA 200 d మరియు GLA 220 d 4 MATIC లతో ముందుకు వచ్చింది.
* డైనమిక్ ఎక్స్‌టీరియర్ హైలెట్స్ - జిఎల్ఎ నూతన ఫీచర్స్ చూస్తే ఇట్టే ఆకట్టుకుంటాయి. డిజైన్ చూడముచ్చటగా వుంటుంది.
* ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్: GLA 220 d 4MATIC ఫీచర్స్ చూస్తే 2,143 ఇన్లైన్ 4 ఇంజిన్‌తోనూ 125 kw అవుట్‌పుట్‌తో 350 Nm టార్క్‌తో కేవలం 7.7 సెకన్లలో 0-100 వేగాన్ని అందుకోగలదు.
* 7జి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషనుతో మోటరైజ్ చేయబడింది. అంతేకాదు రాపిడ్ గేర్ షిప్ట్స్‌కు GLA నిర్థారిస్తుంది. డ్రైవింగ్ ప్రదర్శనలో ఫ్యూయల్ ఎఫిషియన్సీలోనూ ఎలాంటి రాజీలేకుండా తయారుచేయడం జరిగింది.
* 45.7 సెం.మీ(18 అంగుళాలు) 5 ట్విన్ స్పోక్ లైట్ ఎల్లాయ్ వీల్స్, బంపర్లో ట్విన్ పైప్ ఎగ్జాస్ట్ సిస్టమ్, క్రోమ్ ప్లేటెడ్‌తో చేయబడి వుంది.
* ప్రకాశవంతమైన లెడ్ హై పెర్ఫార్మెన్స్ హెడ్ లైట్లు ఫైబర్ ఆప్టిక్స్‌తో చేయబడ్డాయి.
GLA 200 d స్పోర్ట్: రూ. 33.85 లక్షలు, GLA 220 d 4 MATIC : రూ 36.75 లక్షలు.
ఈ కొత్త కార్లను ప్రవేశపెట్టిన సందర్భంగా మైకేల్ జోప్ మాట్లాడుతూ.... ఇప్పటికే ఈ కార్లు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. కొత్తదనాన్ని కోరుకునేవారికి ఈ కార్లు ఆకట్టుకుంటాయి. సేఫ్టీ ఫీచర్స్, స్పోర్టీ డిజైన్స్, కావలసిన అన్ని హంగులు ఈ కార్లలో వున్నాయన్నారు.