రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.10 కోట్ల కరెన్సీ

గురువారం, 2 నవంబరు 2023 (11:04 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ 2 వేల రూపాయల నోట్‌ను భారత రిజర్వు బ్యాంకును ఇటీవలే ఉపసంహరించుకుంది. అదేసమయంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు వీలుగా కొంత సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసినప్పటికీ ప్రజల్ వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల కరెన్సీ ఉందని తెలిపింది. చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97 శాతానికి పైగా కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చిందని తెలిపింది. 
 
సర్క్యులేషన్ నుంచి బ్యాకింగ్ వ్యవస్తల్లోకి లక్షల కోట్ల కరెన్సీ తిరిగి రాగా, ప్రజల వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023 మే 19న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు లేదా మార్పిడి చేసుకునేందుకు వీలుగా తొలుత సెప్టెంబరు 30వ తేదీ వరకు గడవు ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరు ఏడో తేదీకి పొడగించింది. అయినప్పటకీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాంశం కల్పించింది. ఈ నోట్లు కూడా తిరిగి వస్తే రూ.2 వేల నోట్ల చెలామణిని దేశంలో పూర్తిగా రద్దు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు