రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రుణ విముక్తి కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చానని ముఖేష్ అంబానీ చెప్పారు. సంస్థ రుణ రహితంగా మారుస్తానని 2019 ఆగస్టు 12 న సంస్థ 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. 2021 మార్చి 31 గా నిర్ణయించిన గడువు కన్నా 9 నెలల ముందే హామీని నెరవేర్చారు. 9 నెలల ముందు కంపెనీ రుణ రహితంగా మారిందని కంపెనీ వాటాదారులకు తెలియజేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
కాగా, 2020 మార్చి 30 నాటికి రిలయన్స్ కంపెనీకి రూ.1,61,035 కోట్ల రుణాలు ఉన్నాయి. గత 58 రోజుల్లో కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడులను సాధించింది. ఇవేకాకుండా, రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.53,124.20 కోట్లను సమీకరించింది. ఫలితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరక ఆస్తి విలువ రూ.60.3 బిలియన్ డాలర్లుగా పెరిగిపోయింది.