రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో చౌక ధరకే చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఇందుకోసం రైల్వే స్టేషన్లలో వైద్యశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో తూర్పు రైల్వేకు చెందిన పది రైల్వే స్టేషన్లలో తొలి విడతగా క్లినిక్స్‌ను ఆరంభించనుంది. వీటికి ''వన్ రుపీ క్లినిక్'' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ వైద్యశాలలకు వెళ్ళే ప్రయాణీకుల వద్ద చికిత్సకు అనంతరం రూపాయిని మాత్రమే ఫీజుగా తీసుకుంటారు. ఈ మాసాంతంలోపు ఈ సేవలు ప్రారంభం అవుతాయని, తొలి వన్ రుపీ క్లినిక్ గట్కోపర్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.