పాన్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింకు చేయడం సాధ్యంకాదని ఐటీ శాఖ హెచ్చరిస్తుంది.
ఈ యేడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఆదాయపన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింకు కోసం రూ.వెయ్యి చొప్పున సూలు చేస్తుంది. వచ్చే యేడాది మార్చి వరకు రూ.వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింకు చేసుకోవచ్చని చెబుతోంది.
ఈ రెండు నంబర్లను మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చు.
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి క్విక్ లింక్ విభాగంలో లింక్ ఆధారం ఎంపికై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబరును, ఆధార్ నంబరును, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి.