దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల తర్వాత ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు అన్నీ కలిసి వాహనదారుల నడ్డి విరిచేస్తున్నాయి. తెలంగాణలో సైతం పెట్రోల్ ధర సెంచరీ దాటింది.
ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వరుసగా 17 సార్లు ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. మంగళవారం లీటరు పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 23 పైసలను పెంచడంతో ధరలు రికార్డుస్థాయికి చేరాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.49కి చేరగా, డీజిల్ ధర రూ.85.38కి పెరిగింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే.