హైదరాబాద్‌లో ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 విడుదల చేసిన పియాజ్జియో

బుధవారం, 20 జనవరి 2021 (22:17 IST)
ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించినట్లు పియాజ్జియో ఇండియా నేడు వెల్లడించింది. అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఈ ప్రీమియం స్కూటర్‌ ఇప్పుడు 1,26,372 రూపాయల ధరలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా లభిస్తుంది. దీనిని తొలుత 5వేల రూపాయల మొత్తం చెల్లించి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ డీలర్‌షిప్‌లు లేదా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ వద్ద కూడా బుక్‌ చేసుకోవచ్చు.
 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో ఏప్రిలియా యొక్క తాజా అంతర్జాతీయ డిజైన్‌ భాషను జొప్పించారు. దీనిలో అత్యున్నత పనితీరు కలిగిన సింగిల్‌ సిలెండర్‌, 4స్ట్రోక్‌, ఎయిర్‌కూల్డ్‌, మూడు వాల్వ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ స్వచ్ఛమైన ఉద్గారాల ఇంజిన్‌ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత శక్తి 11 పీఎస్‌ను 7100 ఆర్‌పీఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది.
 
అసాధారణ సవారీ అనుభవాలను, అత్యున్నత స్థాయి సౌకర్యం సైతం అందించడానికి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో అతిపెద్ద, పొడవైన, సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన సీట్లు ఉన్నాయి. ఇవి బూడిద మరియు ఎరుపు రంగు దారాలతో ప్రత్యేకమైన కుట్టు నమూనాతో ఉండటం వల్ల లెదర్‌ స్యూడ్‌ అనుభూతులను అందించడంతో పాటుగా మహోన్నత పనితనాన్ని సైతం అందిస్తుంది. పదునైన బాడీ లైన్స్‌, జియోమెట్రిక్‌ కాంటూర్స్‌, అత్యున్నత శ్రేణి పనితనం వంటివి ప్రీమియం అనుభూతులను ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160కు అందిస్తాయి. ఈ స్కూటర్‌ ఏడు లీటర్ల ఇంధన ట్యాంకు సామర్థ్యంతో వస్తుంది.
 
ఈ సందర్భంగా శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ  ‘‘ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను హైదరాబాద్‌లో ఆవిష్కరించడం ద్వారా, మా వివేకవంతులైన వినియోగదారులకు మా ప్రీమియం, వైవిధ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికీ ఈ అనుభవాలను మరింతగా చేరువ చేస్తామనే భరోసా అందిస్తూ, మేము భారతదేశ వ్యాప్తంగా మా డీలర్‌నెట్‌వర్క్‌ను  విస్తరిస్తున్నాము.
 
ప్రీమియం ఆలోచనా ధోరణులు కలిగిన వ్యాపారవేత్తలను వారి సొంత పట్టణాలలోని మా అత్యంత ఉత్సాహపూరితమైన డీలర్‌షిప్‌ వ్యాపార నమూనాల వద్దకు స్వాగతిస్తున్నాం. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160  మహోన్నత శైలి, అత్యున్నత పనితీరు, అసాధారణ సౌకర్యం ప్రదర్శిస్తుంది. భారతీయ ప్రీమియం ద్విచక్ర వాహన మార్కెట్‌లో అత్యున్నత ప్రమాణాలను ఇది నెలకొల్పగలదని మేము నమ్ముతున్నాము’’ అని అన్నారు.
 
భారీ 210 చదరపు సెంటీమీటర్ల బహుళ పనితీరు కలిగిన పూర్తి డిజిటల్‌ క్లస్టర్‌ డిస్‌ప్లే కలిగిన ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160లో పలు ఫీచర్లు అయినటువంటి డిజిటల్‌ స్పీడ్‌ఇండికేటర్‌, ఆర్‌పీఎం మీటర్‌, మైలేజీ ఇండికేటర్‌, యావరేజ్‌ స్పీడ్‌ మరియు టాప్‌ స్పీడ్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ ఫ్యూయల్‌ ఇండికేటర్‌, ఇంజిన్‌ మల్టీఫంక్షన్‌ ఇండికేటర్‌ మొదలైనవి ఉన్నాయి. వినియోగదారులు మొబైల్‌ కనెక్టవిటీ యాక్ససరీని సైతం ఎంచుకోవచ్చు. ఇది  యూజర్ల మొబైల్‌ను స్కూటర్‌తో అనుసంధానిస్తుంది మరియు లొకేట్‌ చేసేందుకు సైతం అనుమతిస్తుంది. అవసరమైన సందర్భాలలో సెక్యూరిటీ అలారం సైతం మోగించడంతో పాటుగా ఇంకెన్నో చేస్తుంది.
 
దీనియొక్క వినూత్నమైన, సరిపోల్చలేనటువంటి  లుక్స్‌ను మూడు కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినీఫ్‌తో కాంప్లిమెంట్‌ చేశారు. ఏప్రిలియా యొక్క సిగ్నేచర్‌ గ్రాఫిక్స్‌ను ఇది ప్రదర్శించడంతో పాటుగా మాట్‌ బ్లాక్‌ డిజైన్‌ ట్రిమ్స్‌ను ఇది కలిగి ఉంటుంది. దీనితో పాటుగా క్రోమ్‌ ఎలిమెంట్స్‌ సైతం ఉన్నాయి.
 
ఈ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌, ఐ లైన్‌ పొజిషన్‌ లైట్స్‌ ముందు ఉన్న ఇండికేటర్‌ బ్లింకర్స్‌తో మిళితం కావడంతో పాటుగా దీని యొక్క వినూత్నమైన లైట్‌ ప్లేను సృష్టిస్తుంది; డైమండ్‌ రిఫ్లెక్షన్‌ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టైల్‌ లైట్లు, అనుసంధానిత వెనుక బ్లింకర్లతో మిళితమై అదే రీతిలో నూతన తరపు సౌందర్యం అందిస్తాయి. ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 వాహనాలు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో పాటుగా వెంటిలేటెడ్‌ డిస్క్‌ బ్రేక్‌ మరిము ట్విన్‌ పాట్స్‌ కాలిపర్‌ హైడ్రాలిక్‌ బ్రేక్‌నుకలిగి ఉన్నాయి.ఇవి అత్యున్నత బ్రేక్‌ పనితీరును అందిస్తాయి. ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌160 అత్యంత ఆకర్షణీయమైన గ్లోసీ రెడ్‌, మాట్‌ బ్లూ, గ్లోసీ వైట్‌ మరియు మాట్‌ బ్లాక్‌ రంగులలో లభ్యమవుతుంది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు