ప్రముఖ దర్శకుడు `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం రాధాకృష్ణ. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంతెన నరసింహరాజు (చిలుకూరు) సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మిస్తున్నారు.
ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ - "'రాధాకృష్ణ' సినిమాకు మెయిన్ సాంగ్ అంటే సినిమాకు ఆత్మలాంటి పాట 'నిర్మల బొమ్మ ఎంత బాగున్నవమ్మా..'ను విజయశాంతిగారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మల్ బొమ్మల విశిష్టతను, ఆ బొమ్మలను ఎలా చేస్తారు అనే గొప్పతనాన్ని చాటి చెప్పే సాంగ్ ఇది. సుద్దాల అశోక్ తేజగారు రాసిన ఈ పాటను మంగ్లీతో పాడించాం. అన్ని బాగా కుదిరాయి. ఎంటైర్ యూనిట్‌కు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను" అన్నారు.
చిత్ర నిర్మాత పుప్పాల సాగరిక కృష్ణకుమార్ మాట్లాడుతూ -``మా రాధాకృష్ణ చిత్రంలోని `నిర్మల బొమ్మ` పాటను విడుదలచేసిన విజయశాంతి గారికి మా టీమ్ అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కనుమరుగైపొతున్న మన చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే సామాజిక దృక్పధంతో నిర్మల్ బొమ్మలు తయారుచేసే కళాకారుల గురించి, వారు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా నిర్మించడం జరిగింది.
ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు మా నిర్మల్ బొమ్మల మీద చక్కని సాహిత్యం అందించారు. అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వర్క్ చేసిన ఎం.ఎం.శ్రీలేఖగారు సాహిత్యానికి తగ్గట్టుగా ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించడం జరిగింది. అలాగే మంగ్లీ అందంగా ఆలపించారు. వారందరి దన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ నిర్మల బొమ్మ సాంగ్ కూడా తప్పకుండా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అన్నారు.
అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్), లక్ష్మీ పార్వతి, అలీ, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, ఎడిటింగ్: డి. వెంకటప్రభు, ఆర్ట్: వి. ఎన్ సాయిమణి, కో- ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, సమర్పణ : మంతెన నరసింహరాజు (చిలుకూరు), నిర్మాణ సారథ్యం: కృష్ణ కుమార్, నిర్మాత: పుప్పాల సాగరిక కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ: శ్రీనివాస రెడ్డి, దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.