లగ్జరీ రైళ్ల ఛార్జీలు ఇక సగానికి సగం తగ్గిపోనున్నాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్‌ప్రెస్ లాంటి లగ్జరీ రైళ్లు ఇప్పటివరకు ఎగువ మధ్య తరగతి వాళ్లకు, ధనికులకు మాత్రమే పరిమితమైపోయాయి.
ది పయనీర్ నివేదిక ప్రకారం తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి వుంటుంది. ఈ లగ్జరీ రైళ్లపై ప్రయాణీకుల ఆసక్తి గణనీయమైన తగ్గిపోవడంతోనే రైల్వే శాఖ ఛార్జీలను తగ్గించేలా నిర్ణయం తీసుకుంది.