2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ఉద్యోగుల వేతనాలకు రూ.69,713 కోట్లు ఖర్చు చేసింది. అది 2017-18లో రూ.72,705 కోట్లకు చేరుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ రూ.76,451 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే 89,900 మంది సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది. భద్రతా విభాగంలోనే భారీగా ఖాళీలున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వేలో సుమారు 1.2 లక్షల ఉద్యోగ ఖాళీలు భద్రతా విభాగంలోనే వున్నాయి. ప్రతి ఏడాది రైల్వేలో సుమారు 40,000-45,000 మంది రిటైర్ అవుతున్నట్లు సమాచారం. తాజా నియామకాలతో రైల్వేపై ఏటా రూ.4వేల కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.