జన్‌ధన్ ఖాతాల్లోకి మరోమారు రూ.500 నగదు జమ

బుధవారం, 3 జూన్ 2020 (21:31 IST)
కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్డౌన్‌లోకి వెళ్లింది. ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా, కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ కోవలోనే ఆర్థికంగా నష్టపోయిన మహిళలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ.500 చొప్పున జన్‍‌ధన్ ఖాతాల్లో నగదును జమ చేసింది. ఇపుడు మూడో విడతగా నగదును జమ చేయనున్నట్టు తీపికబురు చెప్పింది.
 
ఈ విడతలో కూడా ఈ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలోకి రూ.500 జమ కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి 10 వరకు డబ్బు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి చివరి విడత డబ్బును జమ చేస్తున్నట్టు తెలిపింది. 
 
కాగా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో అన్ని రంగాలను ఆదుకునేలా ప్రణాళికలను రూపొందించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు