ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్‌లో వున్న వడ్డీని దీపావళికి..?

బుధవారం, 13 అక్టోబరు 2021 (10:38 IST)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీని జమ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని ఈ దీపావళి లోగా క్లియర్ చెయ్యాలని అనుకుంటోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఆరు కోట్లకు పైగా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వారందరికీ ఈ నెలాఖరులో గానే వడ్డీ వస్తుందని తెలుస్తోంది. 
 
2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీ చాలా కాలంగా క్లియర్ చెయ్యలేదు. అయితే పండుగ సీజన్ కనుక వడ్డీని జమ చెయ్యాలని అనుకుంటోంది. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/లో లాగిన్ అయి అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఎస్ఎంఎస్ ద్వారా ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయి.
 
2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ. గత ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ఫిక్స్ చేసింది ఈపీఎఫ్ఓ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలో ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ ఖాతాదారులు అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు