హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద ఫుట్ వేర్ తయారీదారు అయినటువంటి రిలాక్సో ఫుట్‌వేర్స్ లిమిటెడ్.. త్వరలో రాబోతున్న పండుగ సీజన్‌ను దృష్టి పెట్టుకుని స్టైలిష్, ఇన్నోవేటివ్ ఫుట్ వేర్ రేంజ్‌ని. అదేసమయంలో దాని బ్రాండ్లు అయినటువంటి స్పార్క్స్, ఫ్లైట్ మరియు బహామాస్‌లలో విస్తృతమైన కలెక్షన్, అలాగే మొత్తం కుటుంబం యొక్క రోజువారీ అవసరాలు, అదే విధంగా సందర్భానికి తగ్గట్లుగా ఉపయోగపడే పుట్ వేర్ అందిస్తోంది రిలాక్సో ఫుట్ వేర్స్ లిమిటెడ్. దీనిద్వారా ఫ్యాషన్-ఫార్వర్డ్ ఆకర్షణతో కంఫర్ట్‌ని మిళితం చేసి అందిస్తోంది.
సెప్టెంబర్ 9, 2025న హైదరాబాద్‌లో జరిగిన రిలాక్సో యొక్క రిటైలర్ మీట్‌లో ఈ ఫెస్టివ్ కలెక్షన్‌ను లాంఛ్ చేశారు. దీనిద్వారా ఈ ప్రాంతంలో ఉన్న 245 కంటే ఎక్కువమంది కీలక వాణిజ్య భాగస్వాములను ఒకచోట చేర్చినట్లైంది. ఈ ఈవెంట్లో యువతకు మెచ్చే స్టైల్, అవగాహన ఉన్న వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, స్లిప్పర్లు, స్లైడ్‌లు, క్లాగ్‌లు సిద్ధం చేసింది. అదే సమయంలో పండుగ కోసం ఉన్న అనేక రకాల స్టైలిష్ ఫుట్ వేర్ రెడీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రిలాక్సో యొక్క బలమైన రిటైల్ భాగస్వామ్యాలను అందరిని ఒకచోట చేర్చినట్లైంది. అదే సమయంలో రిటైలర్‌లకు రాబోయే సేకరణలు, ఉత్పత్తి ఆవిష్కరణలు, వృద్ధి వ్యూహాల యొక్క ప్రత్యేక ప్రివ్యూను అందించినట్లు కూడా అయ్యింది.
ఈ ప్రదర్శనలో హైలైట్స్ విషయానికి వస్తే.. స్పార్క్స్ నుండి 50+ కొత్త పండుగ స్టైల్‌లను ఆవిష్కరించడం జరిగింది. ఇవి సమకాలీన డిజైన్‌లు, శక్తివంతమైన రంగులు, ఆటో-లేసింగ్ టెక్నాలజీ, మెరుగైన సౌకర్యం కోసం ప్రత్యేకమైన అవుట్‌సోల్ వంటి వినూత్న లక్షణాలతో రూపొందించబడ్డాయి. ఈ సమావేశంలో కొత్త పండుగ శ్రేణికి రిటైలర్ల నుండి ఉత్సాహభరితమైన స్పందన లభించింది.
ఈ సందర్భంగా రిలాక్సో ఫుట్‌వేర్స్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ గౌరవ్ కుమార్ దువా గారు మాట్లాడుతూ, రిలాక్సోలో, మా బ్రాండ్లు-ఫ్లైట్, స్పార్క్స్ మరియు బహామాస్ - అంతటా విభిన్నమైన పుట్ వేర్ పోర్ట్ ఫోలియోను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇవి సౌకర్యం, మన్నిక, పండుగ స్టైల్ అన్నింటిని కలిపి అందిస్తాయి. ఈ సమావేశంలో ప్రదర్శించబడిన లేటెస్ట్ కలెక్షన్లపై మా రిటైలర్ భాగస్వాముల నుండి వచ్చిన సానుకూల అభిప్రాయం, వినియోగదారులకు మెరుగైన సేవలందించడానికి సరైన సాధనాలు, జ్ఞానం మరియు ఆవిష్కరణలతో వారికి సాధికారత కల్పించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు ఆయన.